Mon Dec 23 2024 18:36:58 GMT+0000 (Coordinated Universal Time)
breaking : గుడ్ న్యూస్ మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ
నేడు మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు
నేడు మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈరోజు సాయంత్రం సచివాలయంలో మున్సిపల్ కార్మికుల సంఘాలతో మంత్రులు చర్చలు ప్రారంభించారు. చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి మున్సిపల్ కార్మికులు విధులు చేరేందుకు అంగీకరించారు. దీంతో మున్సిపల్ కార్మికుల సమ్మెకు తెరపడినట్లయింది. కార్మికుల డిమాండ్లను కొన్నింటిని అంగీకరించింది. అయితే జీవో వచ్చాక పూర్తి స్థాయిలో సమ్మె విరమిస్తామని కార్మికులు చెప్పారు.
ప్రభుత్వం తమ డిమాండ్లకు..
గత రెండు వారాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తుండటంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. దుర్గంధం నెలకొంది. పట్టణాల్లో పరిస్థిితి మరీ తీవ్రంగా మారింది. మున్సిపల్ కార్మికుల డిమాండ్లను కొంత వరకూ అంగీకరించింది. మరికొన్నింటిని ఎన్నికల తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మెను విరమించారు.
Next Story