Wed Dec 18 2024 22:51:42 GMT+0000 (Coordinated Universal Time)
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆట మొదలుపెట్టారా?
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడాక నియోజకవర్గంలో
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడాక నియోజకవర్గంలో పట్టు నిలుపుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకు ప్రచారం చేస్తున్నారు. మొత్తం కుటుంబ సభ్యులను అందరిని రంగంలోకి దింపి గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అధికార పార్టీని ఎదుర్కొంటూ.. టీడీపీ క్యాడర్ ను కలుపుకొని పోవడంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఆయన భార్య కోటంరెడ్డి సుజిత, కుమార్తెలు లక్ష్మీ హైందవి, సాయి వైష్ణవి నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం, దొంతాలి గ్రామంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తెలు లక్ష్మీ హైందవి, సాయి వైష్ణవి లు శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మద్దతు ఇవ్వాలని, ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్ధించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి దొంతాలి గ్రామంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
Next Story