Mon Dec 23 2024 20:22:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జగన్ తో కోటంరెడ్డి భేటీ
ముఖ్యమంత్రి జగన్ తో నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశం కానున్నారు.
ముఖ్యమంత్రి జగన్ తో నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశం కానున్నారు. సాయంత్రం ఐదుగంటలకు కార్యాలయానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కోటంరెడ్డికి పిలుపు వచ్చింది. జగన్ తో భేటీలో పలు అంశాలను కోటంరెడ్డి చర్చించనున్నారు.
అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో...
ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారులపై కూడా ఆయన బహిరంగంగానే విరుచుకుపడుతున్నారు. వివిధ సమావేశాల్లో అధికారులు చెప్పిన పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి పిలుపురావడంతో ఈరోజు భేటీ కానున్నారు.
Next Story