Tue Dec 24 2024 12:21:04 GMT+0000 (Coordinated Universal Time)
రైతులకు అండగా టిడిపి.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు
రైతులకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటన..
విజయవాడ : ఏపీలో అన్నదాతలకు అండగా నిలవనుంచి టిడిపి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి.. రైతులకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందజేసే దిశగా.. "రైతు కోసం తెలుగుదేశం" అనే కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అచ్చెన్న తెలిపారు. రైతుల పక్షాన ప్రభుత్వంతో ఈ కమిటీ పోరాడుతుందన్నారు.
"రైతు కోసం తెలుగుదేశం" కమిటీలో సభ్యులుగా మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి, కూన రవికుమార్, తెలుగు రైతు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలను నియమించారు. అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఈ కమిటీ పర్యటిస్తుందని, రైతులకు పరిహారం అందే దిశగా ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని అచ్చెన్న వివరించారు.
Next Story