Mon Dec 23 2024 12:32:52 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లు.. ఎస్పీలు
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. కొత్త జిల్లాల్లో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుుంది. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో పాటు ఎస్పీలు కూడా నియమించింది. 51 మంది ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రేపు ప్రారంభం......
కొత్త జిల్లాలను రేపు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. కొత్తగా నియమించిన అధికారులు ఆ యా జిల్లా కేంద్రాలకు వెళ్లి ముందుగానే బాధ్యతలను స్వీకరించి జిల్లా కేంద్రాల ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే అర్ధరాత్రి ఐఏఎస్, ఐపీఎస్ ల లను బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
Next Story