Mon Dec 23 2024 07:25:17 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఇద్దరికీ పెద్ద తేడా ఏముంది భయ్యా.. కూల్చివేతలతోనే మొదలయిందిగా
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూలగట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూలగట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వం కూడా అదే మాదిరి కూల్చివేతలను ప్రారంభించినట్లయింది. నాడు తమపై అనుసరించిన విధానాలకు ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అయింది. ఈరోజు తెల్లవారు జాము నుంచే తాడేపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న వైఎస్సార్సీప కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చి వేయించడం ప్రారంభించారు. ఈరోజు తెల్లవారు జామున వచ్చిన బుల్ డోజర్లు, ప్రొక్లెయిన్లతో వచ్చిన సిబ్బంది వైసీపీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు.
వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని...
తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం నిర్మాణం జరుగుతుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా జురుగుతుందని ఫిర్యాదులు అందుకున్న సీఆర్డీఏ అధికారులు ఆ భవనాన్ని కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. కూల్చివేతల సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్లాబ్ వేయడానికి సిద్ధంగా ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయాలని అధికారులు సిద్ధమయ్యారు. అయితే వైసీపీ నేతలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాణంలో ఉన్న...
నిర్మాణంలో ఉన్న తమ భవనాలను కూల్చి వేస్తారని తెలిసి నిన్న వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో హైకోర్టు కూడా చట్టాన్ని అధిగమించి వ్యవహరించవద్దని సూచించింది. సీఆర్డీఏ అధికారులకు హైకోర్టు ఆదేశాలను వైసీపీ తరుపున న్యాయవాది తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. మున్సిపల్ అధికారులు ఈరోజు తెల్లవారు జామునే వచ్చి కూల్చివేతలను ప్రారంభించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతల పనులను చేపట్టడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. శని, ఆదివారాలు కావడం కోర్టుకు సెలవులు ఉండటంతో ఈరోజు తెల్లవారుజామున కూల్చివేతల పనులు ప్రారంభమయ్యాయి.
Next Story