Sun Jan 12 2025 03:57:21 GMT+0000 (Coordinated Universal Time)
ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నూతనంగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకిరం చేశారు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నూతనంగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకిరం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. జస్టిస్ అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, దుప్పల వెంకట రమణ, బొప్పన వరాహ లక్ష్మ్మీనరసింహ చక్రవర్తి, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యామసుందర్, ఊటుకూరు శ్రీనివాస్, తల్లాప్రగడ మల్లికార్జున్ లు న్యాయమూర్తులుగా విచారణ చేపట్టారు.
గవర్నర్ చేత....
కొత్తగా నియమితులైన న్యాయమూర్తులతో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. చీఫ్ జస్టిస్ అనివార్య కారణాలతో ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో గవర్నర్ వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.
Next Story