Mon Nov 25 2024 15:57:07 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : రెండున్నర లక్షల మందికి పింఛన్లు అవుట్.. ప్రభుత్వం షాకింగ్ డెసిషన్?
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పింఛన్ల విషయంలో సీరియస్ గా ఉంది. బోగస్ పింఛనుదారులను గుర్తించాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పింఛన్ల విషయంలో సీరియస్ గా ఉంది. బోగస్ పింఛనుదారులను గుర్తించాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది అర్హత లేకపోయినప్పటకీ పింఛన్లు గత ఐదేళ్ల నుంచి పొందుతున్నట్లు గుర్తించారు. వీరిని పింఛనుదారుల జాబితా నుంచి తొలగించనున్నారు. గత ప్రభుత్వంలో పింఛన్ పంపిణీలో అనేక అక్రమాలు జరిగినట్లు చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అర్హత లేకపోయినా పింఛన్లు మంజూరు చేయడంతో అనర్హులు అనేక మంద పింఛన్లు పొందుతున్నారని, దీనిపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
విస్తుపోయే విషయాలు...
అయితే అధికారులు జరిపిన విచారణలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు రెండున్నర లక్షల బోగస్ పింఛన్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలుున్నాయని అధికారులు తెలిపారు. పింఛన్లలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించడంతో విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు తెలిసింది. ఆధార్ కార్డులో వయస్సు మార్చుకుని, వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారని గుర్తించారు. దివ్యాంగులు కాకపోయినా.. దివ్యాంగుల నకిలీ సర్టిఫికేట్ చూపించి పింఛన్లు అందుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అధికారులను కూడా...
ఇక ఒంటరి మహిళ కాకపోయినా వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారని.. ఇది సరైన పద్ధతి కాదంటూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అన్ని రకాల అక్రమాలు జరిగినట్లు కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గుర్తించింది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా సామాజిక పింఛన్లు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయని తెలియడంతో విచారణకు ఆదేశించారు. ఇన్నాళ్లూ పింఛన్లు మంజూరు చేయడానికి బాధ్యులైన అధికారులను గుర్తించాలని నిర్ణయించారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో 65 లక్షల వరకూ పింఛన్లు అందుతుంటే అందులో చాలా వరకూ కోత పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
Next Story