Thu Dec 19 2024 18:10:56 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీలో మరో పేరు మార్పు.. ఉత్వర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు పేర్లను నూతనంగా ఏర్పాటయిన ప్రభుత్వం మారుస్తుంది
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు పేర్లను నూతనంగా ఏర్పాటయిన ప్రభుత్వం మారుస్తుంది. పింఛన్లు అందించేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ భరోసా కార్యక్రమానికి ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. తాజాగా మరో కీలక నిర్ణయం ఏపీ ప్రభుత్వం తీసుకుంది. గత ప్రభుత్వం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్లు ప్రజల నుంచి ఫిర్యాదును స్వీకరించేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వం.
స్పందన కార్యక్రమానికి...
అయితే స్పందన కార్యక్రమంలో పూర్తి స్థాయి మార్పులు తేవాలని కొత్తగా ఏర్పాటయిన చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. స్పందన పేరు తొలగించింది. దీనిని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై స్పందన స్థానంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రస్సల్ సిస్టమ్ పేరుతో కలెక్టర్లు ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లు ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరించి అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Next Story