Sat Nov 16 2024 04:42:53 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : లిక్కర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇక ఏపీలో అన్ని బ్రాండ్లతో పాటు మరో కీలక నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ లవర్స్ కు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ లవర్స్ కు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగానే మద్యం పాలసీపై ఆయన ఒక ప్రకటన చేసే అవకాశముందని చెబుతున్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు లిక్కర్ లవర్స్ కు అదిరిపోయే న్యూస్ అందించనున్నారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని బ్రాండ్లు మాత్రమే లభ్యమయ్యేవి. తాము అలవాటుపడిన, గతంలో తాము తీసుకునే బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో మందు బాబులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఊరూపేరూ లేని బ్రాండ్లు తెచ్చారంటూ అప్పటి విపక్షనేత చంద్రబాబు కూడా ప్రతి సభలో విమర్శలు చేస్తూ వచ్చారు.
నాణ్యమైన బ్రాండ్లను...
తాము అధికారంలోకి రాగానే అన్ని నాణ్యత కలిగిన బ్రాండ్లను మాత్రమే అందుబాటులో ఉంచుతామని ప్రతి సభలో ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ప్రసంగంలో మద్యం అంశం ఒక పార్ట్ అయింది. మందుబాబులను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నమయినప్పటికీ అనేక మంది మంచి బ్రాండ్లకోసం ఎందరో ఎదురు చూపులు చూస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకుని మరీ ఏపీలో గతంలో విక్రయించేవారు. తెచ్చుకుని దాచుకుని తాగేవారు. అందుకోసమే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి ఆ ప్రాంత మద్యం రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే...
ఇక మరొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అన్ని మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచేవి. అంటే ఎక్సైజ్ శాఖ సిబ్బంది మద్యాన్ని విక్రయించేవారు. కేవలం నగదు చెల్లింపులతోనే మద్యం విక్రయాలు జరుగుతాయి. డిజిటల్ పేమెంట్స్ ను అంగీకరించారు. దీనిపై కూడా విపక్షాలు విమర్శలు చేసినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. అయితే కొత్తగా ఎన్నికయిన ప్రభుత్వం మద్యం దుకాణాలను వేలం ద్వారా ప్రయివేటు వ్యక్తులకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చింది. మద్యం అమ్మకాలు ప్రభుత్వం పనికాదని, నాసిరకం మద్యం సరఫరా అవ్వకుండా చూడటమే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత అని పలుమార్లు చంద్రబాబు అన్నారు.
వేలం నిర్వహించి...
అందుకోసమే వేలం పాట నిర్వహించి మద్యం దుకాణాలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనివల్ల మద్యం ద్వారా వచ్చే ఆదాయం భారీగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించిన కసరత్తులు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రారంభించినట్లు తెలిసింది. త్వరలోనే మద్యం దుకాణాలతో పాటు, బార్లకు కూడా ఆక్షన్ నిర్వహిస్తారని తెలిసింది. ప్రయివేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయానికి పెరగడమే కాకుండా మద్యం రేట్లు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఈ నెల 12న దీనిపై ఒకప్రకటన చేస్తారని భావిస్తున్నారు. మరి చూడాలి.
Next Story