Mon Dec 23 2024 10:06:20 GMT+0000 (Coordinated Universal Time)
కోనసీమ జిల్లాలో వివాహిత కిడ్నాప్
తన భార్యను.. ఆమె పుట్టింటి వారే కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ఆమె సోదరులు, బంధువులు తమపై..
ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వివాహిత కిడ్నాప్ అయింది. అక్టోబర్ 17న బాధిత యువతి నందిని తాను ప్రేమించిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. వివాహమైన 10 రోజులకే నందిని కిడ్నాప్ అవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఆమె భర్త నందిని కిడ్నాప్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తామిద్దరం మొండేటి వారి మెరక వద్ద ఉండగా.. సుమారు 20 మంది వ్యక్తులు వచ్చి తన కళ్లముందే నందినిని కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తన భార్యను.. ఆమె పుట్టింటి వారే కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ఆమె సోదరులు, బంధువులు తమపై నిఘా పెట్టారని, తమ వివాహం ఇష్టంలేకే నందినిని కిడ్నాప్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య అంటే.. తనకు ఎనలేని ఇష్టమని, ఆమె ఆచూకిని కనుగొనాలని పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నందిని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Next Story