Mon Dec 23 2024 02:17:55 GMT+0000 (Coordinated Universal Time)
లక్ష లక్ష్యాన్ని చేరుకుంటారా?
ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ లో తొమ్మిది రౌండ్లు పూర్తయ్యాయి. వైసీపీ అభ్యరథి విక్రమ్ రెడ్డికి 37,609 ఓట్లు వచ్చాయి.
ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ లో తొమ్మిది రౌండ్లు పూర్తయ్యాయి. వైసీపీ అభ్యరథి విక్రమ్ రెడ్డికి 37,609 ఓట్లు వచ్చాయి. బీజేపీకి ఏడు వేలు వచ్చాయి. అయితే ఇంకా పన్నెండు రౌండ్లు ఉన్నాయి. ఈ పన్నెండు రౌండ్లలోనూ వైసీపీకే మెజారిటీ లభిస్తుంది. వన్ సైడ్ గా ఎన్నిక జరిగిందనే చెప్పాలి.
మెజారిటీ పైనే....
అయితే వైసీపీ అధినేత జగన్ లక్ష ఓట్ల మెజారిటీ రావాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ లక్ష లక్ష్యాన్ని వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి చేరుకుంటారా? లేదా? అన్నదే ఇప్పుడున్న చర్చ. గెలుపు పై ఎటువంటి అనుమానాలు తొలి నుంచి లేకపోయినా మెజారిటీ భారీగా సాధించే దిశగానే జగన్ ఆదేశాలు జారీ చేశారు. మండలానికి ఒక మంత్రిని, ఎమ్మెల్యేను ఇన్ ఛార్జిగా నియమించారు. బీజేపీ జాతీయ స్థాయి నేతలు చేసిన ప్రచారం పెద్దగా వర్క్ అవుట్ కాలేదనే చెప్పాలి.
Next Story