Sat Nov 16 2024 01:23:53 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : చీఫ్ సెక్రటరీ మొట్టమొదటి ఆదేశం ఏంటంటే?
ఛీఫ్ సెక్రటరీగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత నీరబ్ కుమార్ ప్రసాద్ తొలి ఆదేశం జారీ చేశారు
ఛీఫ్ సెక్రటరీగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన తొలి ఆదేశం రాజీనామాలపైనే. నీరబ్ కుమార్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీగా పదవీ బాధ్యతలను చేపట్టిన సంగతి తెలిసిందే. 1987 బ్యాచ్ కు చెందిన నీరబ్ కుమార్ ప్రసాద్ నూతన ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలను చేపట్టిన వెంటనే అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాజీనామాలను...
రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు మరియు ఇతర సంస్థలకు సంబంధించి నామినేటెడ్ చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల రాజీనామాలను తెప్పించుకోవాలని, వాటిని వెంటనే ఆమోదించాలని అన్ని శాఖల సెక్రటరీలను ఆదేశించారు. ఇప్పటికే కొందరు వైసీపీ ప్రభుత్వంలో నియమితులైన వారు రాజీనామా చేయగా, మరికొందరు చేయకపోవడంతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆయనను ఉద్యోగ సంఘాల నేతలు కలిసి అభినందనలు తెలియజేశారు.
Next Story