Sun Apr 13 2025 05:35:04 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సిఎస్ గా బాధ్యతలు స్వీకరించారు.
కొత్త సీఎస్ గా...
ఏపీకి కొత్త సీఎస్ గా ఆయన నియమాకం చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన సీఎస్ గా బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిఏడి కార్యదర్శి సురేశ్ కుమార్, స్పెషల్ సిఎస్ గోపాల కృష్ణ ద్వివేది,పిసిసిఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి,ఐటి కార్యదర్శి కె.శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, కార్యదర్శి శ్రీధర్ తదితర శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.
Next Story