Sat Apr 12 2025 09:22:00 GMT+0000 (Coordinated Universal Time)
నారా లోకేష్ తో నితీష్ కుమార్ రెడ్డి భేటీ
టీం ఇండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్ లో సెంచరీ సాధించిన ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు వాడి సత్తా చాటిన నితీష్ ను మంత్రి లోకేష్ అభినందించారు. రాష్ట్రంలో యువ ఔత్సాహక క్రీడాకారులకు నితీష్ స్పూర్తిగా నిలిచారని కొనియాడారు. నితీష్ ను మంగళగిరి చేనేత శాలువా, జ్ఞాపికతో మంత్రి సత్కరించారు.
ఇరవై ఐదు లక్షలసాయం...
నిన్న చంద్రబాబు నాయుడు ను కలిసిన నితీష్ రెడ్డికి ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు లక్షల చెక్కును అందించారు. ఇంటి స్థలాన్ని కూడా త్వరలో ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్పోర్ట్స్ పాలసీ చాలా బాగుందని మీడియాతో చెప్పారు. అయితే అందులో క్రికెట్ ను కూడా చేర్చి యువ క్రీడాకారులను ప్రోత్సహించాలని నితీష్ రెడ్డి కోరారు. ఇందుకు మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
Next Story