Sun Dec 22 2024 08:59:37 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై నాన్ బెయిల్బుల్ కేసు నమోదు
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో నలుగురు నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో నలుగురు నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఒకటో పట్టణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల్లో మదనపల్లె వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, పురపాలక సంస్థ వైస్ ఛైర్మన్ జింకా వెంకటాచలపతి, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డి ఉన్నారు.
కీలక పత్రాలను...
కేసు వివరాలను పోలీసులు మదనపల్లె ఏడీజే కోర్టులో సమర్పించారు. 8 కేసులు నమోదు చేసినట్లు గతంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రకటించగా ఇప్పుడు ఈ నాలుగు కేసుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించగా వారి దగ్గర ఉండకూడని భూముల పత్రాలు లభించాయని పోలీసులు తెలిపారు.
Next Story