Mon Dec 23 2024 03:54:59 GMT+0000 (Coordinated Universal Time)
విడుదలైన ఎన్నారై యశ్
అరెస్ట్ అయిన ఎన్నారై యశ్ విడుదలయ్యారు. 41A నోటీస్ ఇచ్చి
అరెస్ట్ అయిన ఎన్నారై యశ్ విడుదలయ్యారు. 41A నోటీస్ ఇచ్చి విడుదల చేసిన సీఐడీ అధికారులు. తదుపరి విచారణకు రావాల్సి ఉంటుందని తిరుపతి సైబర్ క్రైం విభాగం తెలిపింది. అమెరికా నుంచి వచ్చిన టీడీపీ నేత ఎన్ఆర్ఐ యశ్ ను ఈరోజు ఉదయం సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో యశ్ ను అదుపులోకి తీసుకుని ... గుంటూరు సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. కేసులు పెండింగ్లో ఉండటంతో తీసుకువచ్చామని సీఐడీ పోలీసులు చెప్పారు. మాజీ మంత్రి దేవినేని ఉమ, న్యాయవాదులు పీబీజీ ఉమేష్ చంద్ర, గూడుపాటి లక్ష్మీనారాయణ గుంటూరు సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. సీఐడీ అధికారులతో న్యాయవాదులు మాట్లాడారు. యష్కు సీఆర్పీసీలోని 41ఏ సెక్షన్ ప్రకారం సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. జనవరి 11న విచారణకు హాజరుకావాలని నోటీసులో సీఐడీ అధికారులు కోరారు.
Next Story