Mon Dec 23 2024 10:35:02 GMT+0000 (Coordinated Universal Time)
జూనియర్ ఎన్టీఆర్ వెళ్తారా?
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్రం ముద్రించిన
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్రం ముద్రించిన రూ.100 స్మారక నాణేం నేడు విడుదలకానుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఎంపీలు, సినీ, రాజకీయ రంగాల్లో ఆయనతో కలిసి పనిచేసిన సన్నిహితులు హాజరు కానున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్లు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూ ఉంది.
ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యలు ఢిల్లీ చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు పనిలో పనిగా ఏపీలో దొంగ నోట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
నందమూరి తారకరామారావు సమాజానికి అందించిన సేవలకు గుర్తుగా శత జయంతి సంవత్సరం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక రూ.100 నాణేన్ని ముద్రించింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణేన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్తో తయారు చేశారు. అలాగే ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఎన్టీఆర్ శతజయంతి ఈ ఏడాదితో ముగియడంతో 1923- 2023 అని ముద్రితమై ఉంది.
Next Story