టీడీపీ నుంచి చంద్రబాబు 'సస్పెండ్'.. ఎప్పుడో తెలుసా..?
నందమూరి తారక రామారావు.. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు. పార్టీ పెట్టిన అనతికాలంలోనే
నందమూరి తారక రామారావు.. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు. పార్టీ పెట్టిన అనతికాలంలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. ఆయన పథకాలు, తీసుకొచ్చిన సంస్కరణలు వేటికవే ప్రత్యేకం. వెండితెరపై నటనతోనే కాకుండా రాజకీయ ముఖచిత్రంపై తాను వేసిన మార్కు అమోఘం. అయితే టీడీపీలోకి చంద్రబాబు ఎంట్రీ తర్వాత పరిస్థితులు మారుతూవచ్చాయి. తనకంటూ ప్రత్యేక వర్గాన్ని తయారుచేసుకున్న బాబు.. ఎన్టీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా.. పార్టీని తన వశం చేసుకోవడమే పరమావధిగా పనిచేశారనేది ప్రచారంలో ఉన్న నిజం. ఒకానొక తరుణంలో పెద్దాయన కన్నీళ్లు సైతం పెట్టారంటే.. బాబు రాజకీయం ఆయనను ఏ రేంజ్లో బాధపెట్టివుంటుందనేది ఊహకందని వాస్తవం.
మొదటినుంచి బాబును వ్యతిరేకించిన ఎన్టీఆర్.. సస్పెన్షన్ వేటు వేసినా కూడా తన నుంచి పార్టీని చేజారిపోకుండా కాపాడుకోలేకపోయారు. 28 సంవత్సరాల క్రితం.. సరిగ్గా ఇదే రోజు.. అగస్టు 25న.. 1995లో ఎన్టీఆర్.. టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతి రాజు, విద్యాధర రావు, దేవేందర్ గౌడ్, ఎలిమినేటి మాధవ రెడ్డి లను సస్పెండ్ చేశారు. అయితే అప్పటికే పార్టీపై పట్టును కోల్పోయిన పెద్దాయన.. వేసిన సస్పెన్షన్ వేటును ఎవరూ పట్టించుకోలేదు. సస్పెన్షన్ అనంతరం.. సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశాడు చంద్రబాబు. అప్పటి నుండి 2004 వ సంవత్సరం వరకూ 9 సంవత్సరముల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగి.. అత్యధిక కాలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా చరిత్ర సృష్టించాడు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత మరోమారు సీఎం అయ్యారు. ఎన్టీఆర్.. చంద్రబాబును సస్పెండ్ చేసిన లెటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది.