Sat Dec 21 2024 05:02:54 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఎన్టీఆర్ వర్ధంతి
ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరపనున్నారు
ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరపనున్నారు. 27వ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరపనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. 27వ వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. చంద్రబాబు ఉదయం 11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తారు.
రాష్ట్రమంతటా...
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. విస్తృత ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో పెద్దయెత్తున అన్నదానం నిర్వహించనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ నేతలందరూ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే పిలుపునిచ్చింది.
Next Story