Tue Apr 15 2025 03:08:44 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు ఒక్కసారిగా పెరిగిన రద్దీ... ఎందుకంటే?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగానే ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగానే ఉంది. కంపార్ట్ మెంట్లన్నీభక్తులతో నిండిపోయి కళకళలాడుతున్నాయి. నిన్నటి వరకూ భక్తుల సంఖ్య తగ్గినట్లు కనిపించినా తిరిగి నేటి నుంచి భక్తుల రద్దీ పెరిగిందని, రేపు శనివారం, ఆదివారాలు కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న వారితో పాటు ఏ రోజు కారోజు ఎస్.ఎస్.డి. టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య మరింత పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
పెరిగిన రద్దీతో...
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఎక్కువ మంది భక్తులు తరలి వెళ్లడంతో నిన్నటి వరకూ భక్తుల రద్దీ తగ్గింది. అయితే మహా కుంభమేళా ఈ నెల 26వ తేదీతో ముగియనుంది. మరోవైపు అక్కడ రోజుకు కోటి మంది భక్తులు వస్తుండటంతో పాటు దూర ప్రాంతం కావడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులకు ఎక్కువ మంది తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేస్తున్నారు.
ఇరవై మూడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 58,908 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,549 మంది తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.23 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story