Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. నిన్నటి వరకూ భక్తుల సంఖ్య తక్కువగానే ఉండటంతో స్వామి వారి దర్శనం సులువుగా భక్తులకు దొరికింది. అయితే ఈరోజు నుంచి మాత్రం మళ్లీ భక్తుల సంఖ్య పెరిగింది. ప్రతి శుక్ర, శని,ఆదివారాల్లో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి కంపార్ట్ మెంట్లలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ మరో తుపాను హెచ్చరిక జారీ చేసింది. అయినా భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. క్యూ లైన్ లో ఉన్న వారందరికీ శ్రీవారి సేవకులు అన్న ప్రసాదాలు, మజ్జిగలను అందచేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీలయినంత త్వరగా భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.