Mon Dec 23 2024 13:55:53 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లలో ఉన్న వారికి మంచినీరు, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. రద్దీ గత ఏడాది కంటే ఈ సీజన్ లో ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
క్యూ లైన్లన్నీ...
నిన్న తిరుమల శ్రీవారిని 69,041 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,415 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.19 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 23 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్ లో వెళ్లే టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం 14 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
Next Story