Tirumala : తిరుమలలో భక్తులు సాధారణం.. దర్శనం సులభం
తిరుమలో ఈరోజు భక్తుల రాక తగ్గింది. ఆదివారం అయినా భక్తులు ఎక్కువగా లేరు.
తిరుమలో ఈరోజు భక్తుల రాక తగ్గింది. ఆదివారం అయినా భక్తులు ఎక్కువగా లేరు. దసరా సెలవులు ముగియడంతో పాటు భారీ వర్షాల నేపథ్యంలో భక్తులు తిరుమలకు తక్కువగా వస్తున్నారు. సాధారణంగా శని, ఆదివారాలు తిరుమల వీధులన్నీ కిక్కిరిసి పోతుంటాయి. కంపార్ట్‌మెంట్లన్నీ ఫుల్లుగా ఉంటాయి. అలాంటిది ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఈరోజు సులువుగా మారింది. ఆదివారం కావడంతో ఈరోజు తిరుపతికి చెందిన స్థానికులు ఎక్కువ మంది శ్రీవారిని దర్శించుకునే వీలుంది. మరోవైపు ఆన్లైన్లో జనవరి నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల అయ్యాయి. లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు జరగనుంది. రేపు ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లు కేటాయింపు జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.