Tirumala : నేడు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ...తిరుమలలో రద్దీ నేడు ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. తిరుమల వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది
తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. తిరుమల వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుండటంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. రేపు ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 12వ తేదీన చక్రస్నానంతో ముగుస్తాయి. స్వామి రోజుకొక రూపంలో మాడవీధుల్లో సంచరిస్తారు. అందుకే బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని వీఐపీ దర్శనాలు, బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. సర్వదర్శనం ద్వారానే భక్తులు శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు గురువారం కావడం దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో ఈ తొమ్మిది రోజుల పాటు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనుంది. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా వసతి కోసం అధికారులు ప్రత్యేకంగా డ్రైవ్ చేస్తున్నారు. ఎక్కువ రోజుల తిరుమలలో ఉండే అవకాశం లేదు. కేవలం ఒకరోజు మాత్రమే వసతి గృహాన్ని కేటాయిస్తారు. అవసరమైతే మరోరోజు పొడిగించుకునే వీలుంది. దీంతో భక్తులకు వసతి గృహాల కొరత లేకుండా చేయాలన్నది టీటీడీ అధికారుల ఆలోచన.