Wed Dec 18 2024 20:55:28 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ ఇంటి వద్ద బ్యారికేడ్లను తొలగించిన అధికారులు
తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం ఇంటి వెనుక ఉన్న అడ్డంకులను అధికారులు తొలగించారు
తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం ఇంటి వెనుక ఉన్న అడ్డంకులను అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఇల్లు, సీఎం క్యాంప్ కార్యాలయం అదే కావడంతో అధికారులు భద్రత ఏర్పాట్లలో భాగంగా వెనక వైపు రోడ్డును మూసివేశారు. అయితే ఇప్పుడు జగన్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ అడ్డంకులను అధికారులను తొలగిస్తున్నారు.
నాలుగు వైపు రోడ్లను...
ఇటీవల జగన్ ఇంటి ముందు నుంచి వెళ్లే రహదారిని తెరిచి ప్రజలకు ప్రయాణించే వీలు కల్పించిన అధికారులు తాజాగా జగన్ ఇంటి వెనుక వైపు ఉన్న అడ్డంకులను కూడా తొలగించారు. పోలీస్ చెక్ పోస్టును కూడా తొలగించారు. ఇప్పుడు జగన్ ఇంటికి నాలుగు వైపుల రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
Next Story