Wed Jan 08 2025 03:20:14 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : నంద్యాల పోలీసులపై అల్లు అర్జున్ పర్యటన ఎఫెక్ట్
హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు
స్టయిలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్బీ కానిస్టేబుళ్లు స్వామినాయక్, నాగరాజును వీఆర్ కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నంద్యాలలో ఎన్నికల ప్రచారం కోసం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చినప్పుడు భారీ జనసమీకరణపై వివాదం తలెత్తుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ ఘటనలో...
ఇప్పటికే ఈ ఘటనలో ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ రాజారెడ్డికి నోటీసులు ఇచ్చారు. . మరో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు. టూటౌన్ ఎస్ బి హెడ్ కానిస్టేబుల్ స్వామి నాయక్, తాలూకా ఎస్ బి కానిస్టేబుల్ నాగరాజులపై చర్యలు తీసుకున్నారు. 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తిచేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది.
Next Story