Mon Dec 23 2024 12:48:05 GMT+0000 (Coordinated Universal Time)
సాగర్ ప్రాజెక్టు వద్ద ఆంక్షలు.. దేనికంటే?
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 18 గేట్లను అధికారుల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండిపోతున్నాయి. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 18 గేట్లను అధికారుల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 18 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 1,45,800 క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు వదులుతున్నారు. నాగార్జున సాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో ప్రస్తుతం 1,74,120 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 59అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది.ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ312.0450 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450గా ఉంది.
గేట్లు తెరుచుకోవడంతో...
జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. దీంతో నాగార్జున సాగర్ లో పోలిసులు అప్రమత్తమయ్యారు. బందోబస్తును నిర్వహిస్తున్నారు. గేట్లు తెరుచుకోవడం తో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈరోజు ఆదివారం కావడంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. డ్యాం పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసుల ముందస్తు చర్యలు తీసుకున్నారు. డ్యాం వద్దకు వాహనాలు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. జెన్ కో కార్యాలయం వరకే వాహనాలకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు
Next Story