Thu Dec 26 2024 15:16:38 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : అల్లాడిస్తున్న అల్పపీడనం.. ఎన్ని సార్లు దిశమార్చుకుని.. ఇక్కట్లు పాలు చేస్తుందంటే?
బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే అదే సమయంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరింత బలహీన పడే అవకాశముందని కూడా అధికారులు అంచనాలు వేస్తున్నారు. కానీ ఈ అల్పపీడనం మాత్రం వాతావరణ శాఖ అధికారులకు అంతు చిక్కకుండా ఉంది. ఇప్పటికి ఆరు సార్లు దిశను మార్చుకుంది. తొలుత అంచనా వేసుకుంటున్నట్లు అల్పపీడనం ప్రయాణం సాగడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో ఇది తమకు అరుదుగా జరిగే విషయమని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఇప్పటికే అల్పపీడనం, తీవ్ర అల్పపీడనంగా మారి తర్వాత వాయుగుండంగా మారి మళ్లీ అల్పపీడనంగా రూపాంతంరం చెందింది.
ఏ దారి ఎటు వెళుతుందో?
తమిళనాడు తీరంవైపు వెళుతుందని అంచనాలు వేస్తున్నా అది కదలడం లేదు. అల్పపీడనంగా బలపడి వాయుగుండంగా మారడం లేదు. అలాగని అల్పపీడనం కూడా బలహీనపడటం లేదు. ఇలాంటి పరిస్థితిని తాము ఎప్పుడూ చూడలేదని, చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గత పది రోజుల నుంచి ఈ అల్పపీడనం వాతావరణ శాఖ అధికారులను సయితం తికమక పెడుతుంది. ఏ దారి వెళుతుందో తెలియడం లేదు. ఎక్కడ తీరం దాటుతుంది? ఎప్పుడు బలహీన పడుతుందన్న అంచనాలకు అందకుండా ఈ అల్పపీడనం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
భారీ వర్షాలు తప్పవట...
అయితే ఈ అల్పపడీనం ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశముందని మాత్రం చెబుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షం కురుస్తుందని తెలిపారు. ఇప్పటికే కోస్తాంధ్రలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు కూడా తతగ్గుముఖం పట్టాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. చలి ప్రభావంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న రెండు రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఏపీలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 5.9 డిగ్రీలు, హైదరాబాద్లో 11.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోనూ తేలికపాటి జల్లులు పడే అవకాశముందని తెలిపింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story