Thu Nov 14 2024 20:40:55 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి అధిక రద్దీ
ఈరోజు మంగళశారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు
తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు మంగళశారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. నిన్న వినాయక చవితి పండగ కావడంతో కొంత భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా నేటి నుంచి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఘాట్ రోడ్ లో 24 గంటలూ వాహనాల రాకపోకలకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కువ మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారకిని 62,745 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 24,451 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.10 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పంధొమ్మిది కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం పదహారు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
Next Story