Sun Dec 22 2024 22:12:58 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో జరుగుతున్న ఆ ప్రచారాలన్నీ...అవాస్తవాలే... నమ్మొద్దండి
తిరుమలలో శ్రీవారి అన్న ప్రసాదాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరారు
తిరుమలలో శ్రీవారి అన్న ప్రసాదాల విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను విశ్వసించవద్దని భక్తులకు టిటిడి విజ్ఞప్తిచేసింది. తిరుమల శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలు సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించిందని, అదేవిధంగా అన్నప్రసాదాల దిట్టంకూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుందని, ఇది పూర్తిగా అసత్యమని టీటీడీ ఈవో జె శ్యామల రావు తెలిపారు.
చర్చించిన మాట నిజమే కాని...
ఇటీవల అర్చక స్వాములతో, ఆలయ అధికారులతో సమావేశమై స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాల గురించి, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా టీటీడీ ఈవో చర్చించారని, అంతేతప్ప వీటిపై ఎటువంటి నిర్ణయము తీసుకోలేదని తెలిపింది. అయితే కొంతమంది సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాలు తయారీలో మార్పులు చేశారంటూ, దిట్టం పెంచినట్టు వదంతులు సృష్టిస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని, ఇటువంటి అవాస్తవ వార్తలు నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది.
Next Story