Mon Dec 23 2024 10:51:48 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : డిసెంబరులో శ్రీవారి ఆదాయం ఎంతంటే?
తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం 108 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు
తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం 108 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో భారీ వర్షాలు పడుతుండటం, తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో తిరుమలకు భక్తుల వచ్చే వారి సంఖ్య తక్కువగా కనిపిస్తుంది. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే తిరుమకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. క్యూ లైన్లన్నీ ఖాళీగానే ఉన్నాయి.
దర్శనం నాలుగు గంటలే...
నేడు ఐదు కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లో ఉన్న భక్తులకు దర్శనానికి కేవలం నాలుగు గంటల సమయం మాత్రమే పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 58,278 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 17,220 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story