Mon Dec 23 2024 11:20:51 GMT+0000 (Coordinated Universal Time)
YSR : వైఎస్సార్ విగ్రహం తొలగింపు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించారు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించారు. ప్రభుత్వం మారడంతో అధికారులు కూడా ఆ విగ్రహాన్ని తొలగించడానికి సిద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే విద్యను బోధించే చోట రాజకీయ నేతల విగ్రహాలను పెట్టడం సరికాదని భావించిన అధికారులు ఈ విగ్రహాన్ని ఇప్పుడు తొలగిస్తున్నారు.
యూనివర్సిటీలో...
విద్యాలయాల్లో రాజకీయాలకు చోటు ఉండకూడదని అధికారులు చెబుతున్నారు. అదితప్పుడు సంకేతాలను పంపుతుందని, అందుకే వైఎస్సార్ విగ్రహాన్ని తొలిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అధికారులే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో దానిని తొలగిస్తుండటం విశేషం.
Next Story