Sat Dec 28 2024 01:32:24 GMT+0000 (Coordinated Universal Time)
Sankranthi Holidays : ఏపీలో సంక్రాంతి హాలిడేస్ ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవులు కుదించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అధికారులు చెబుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవులు కుదించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి పండగ ఏపీలో పెద్ద పండగ. ప్రతి ఒక్కరూ ఈ పండగకు సొంతళ్లకు చేరుకుంటారు. తమ కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి సంక్రాంతి పండగ మూడు రోజులు గడుపుతారు. అయితే ఇటీవల తరచూ కురుస్తున్న వర్షాలకు వరస సెలవులు ఇవ్వడంతో సంక్రాంతి సెలవులు తగ్గించారని ప్రచారం జరిగింది. ఈ నెల11 లేదా12 నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభమవుతాయని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది.
పెద్ద పండగకు...
అయితే సంక్రాంతి సెలవులు ముందుగా నిర్ణయించిన ప్రకారం అకడమిక్ క్యాలెండర్ లో రూపొందించిన మేరకే ఉంటాయని అధికారులు చెప్పారు. సంక్రాంతి సెలవులుజనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ఉంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. అకడమిక్ క్యాలండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని చెప్పారు. జరుగుతున్న ప్రచారాన్ని నమ్మాల్సిన పనిలేదన్నారు. ఏదైనా మార్పులుంటే ప్రభుత్వమే అధికారికంగా ప్రకటన చేస్తుందని, ఇటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story