Mon Dec 23 2024 11:03:54 GMT+0000 (Coordinated Universal Time)
కర్నూలులో ఇద్దరికి ఒమిక్రాన్
కర్నూలు జిల్లాలో ఒమిక్రాన్ ప్రవేశించింది. ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని వైద్యులు నిర్ధారించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ కలకలం ఆగడం లేదు. తాజాగా కర్నూలు జిల్లాలో ఒమిక్రాన్ ప్రవేశించింది. ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఒక్కరోజే పది ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే కర్నూలు జిల్లాలోని డోన్ లో ఒక ప్రయివేటు స్కూల్ కరస్పాండెంట్ దంపతులకు కరోనా సోకింది.
దుబాయ్ వెళ్లి వచ్చిన....
వీరిద్దరూ ఇటేవలే తమ బంధువులు ఉంటున్న దుబాయ్ కు వెళ్లివచ్చయారు. దుబాయ్ వెళ్లి వచ్చిన వారిద్దరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే వీరిని వెంటనే క్వారంటైన్ కు తరలించారు. ఏపీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
Next Story