Thu Dec 19 2024 16:47:20 GMT+0000 (Coordinated Universal Time)
ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాబు పర్యటన
ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటించనున్నారు
ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఏలూరు, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల పరిధిలో సభలు, రోడ్ షోలలో పాల్గొంటారు.
మూడు రోజులు....
ఈ నెల 12న నూజివీడులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ ఉంటుంది. ఈ నెల 13న గుడివాడలో చంద్రబాబు రోడ్ షోతో పాటు బహిరంగ సభను నిర్వహిస్తారు. 13వ తేదీ రాత్రి నిమ్మకూరులో చంద్రబాబు బస చేస్తారు. ఈ నెల 14న మచిలీపట్నంలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే జీవో నెంబరు 1 అమలులో ఉండటంతో ఎక్కడ సభలు ఏర్పాటు చేస్తారు? పోలీసులు అనుమతి ఇస్తారా? అన్న దానిపై చర్చ జరుగుతుంది.
Next Story