Tue Dec 24 2024 00:55:39 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు గుంటూరు జిల్లా పర్యటన ఖరారు
ఈ నెల 25, 26, 27న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఈ నెల 25, 26, 27న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు పెదకూరపాడు, సత్తెనపల్లి, తాడికొండలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు పర్యటన కోసం భద్రత కల్పించాలని ఇప్పటికే పోలీసులకు అనుమతి కోసం తెలుగుదేశం పార్టీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. తగిన భద్రత కల్పించాలని డీజీపీని కూడా వారు కోరనున్నారు.
భద్రత కోసం...
ఈ మూడు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలిపారు. యర్రగొండపాలెంలో జరిగిన ఘటనతో ఎన్ఎస్జీ భద్రత బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఆయనకు భారీ బందోస్తును ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. చంద్రబాబును అడ్డుకుంటామని ఇప్పటికే వైసీపీ ఎస్సీ నేతలు ప్రకటించడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అనుమతి ఉన్న చోట మాత్రమే పర్యటించాలని ఆదేశాలు జారీ చేయనున్నారు.
Next Story