Mon Dec 23 2024 14:53:54 GMT+0000 (Coordinated Universal Time)
నిన్న హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
తిరుమలలో ముక్కోటి ఏకాదశి రోజున స్వామి వారికి హుండీ ఆదాయం గత రికార్డులను అధిగమించింది.
తిరుమలలో ముక్కోటి ఏకాదశి రోజున స్వామి వారికి హుండీ ఆదాయం గత రికార్డులను అధిగమించింది. ఒక్కరోజులు ఐదు కోట్ల రూపాయలు వస్తున్న ఆదాయం ముక్కోటి ఏకాదశి రోజున పెరిగింది. శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం 10 రోజుల పాటు సాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం టోకెన్లు జారీ చేసింది. భక్తులు వేల సంఖ్యలో తిరుమల చేరుకుంటున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లలో భక్తులు స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు.
వైకుంఠ ఏకాదశి...
నిన్న వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారిని 69,414 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 18,612 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 7.68 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story