Tue Dec 24 2024 03:01:31 GMT+0000 (Coordinated Universal Time)
TDP : 9న సమన్వయ కమిటీ భేటీ
ఈ నెల 9వ తేదీన జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు అధికారికంగా ఖరారయింది. ఇప్పటికే ఒకసారి సమన్వయ కమిటీ భేటీ రాజమండ్రిలో జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. ఆ సమావేశంలో జిల్లా స్థాయిలో రెండు పార్టీల నేతల సమన్వయ సమావేశం జరగాలని నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని రోజులుగా జిల్లాల స్థాయిలో రెండు పార్టీల నేతలు సమావేశమై పార్టీలు అనుసరించాల్సిన ఉమ్మడి పోరాటంపై చర్చించారు.
కేంద్ర పార్టీ కార్యాలయంలో...
అయితే తాజాగా మరోసారి రెండు పార్టీలు భేటీ అవుతున్నాయి. ఈ నెల 9వ తేదీన జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగనుంది. రెండు పార్టీల నుంచి ఆరుగురు సభ్యులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి మ్యానిఫేస్టోపై చర్చించే అవకాశాలున్నాయని తెలిసింది. దీంతో పాటు ఉమ్మడి పోరాటం పై కూడా రెండు పార్టీల మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రధాన అంశంగా మారనుంది. ఏఏ అంశాలపై పోరాటం చేయాలన్న దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.
Next Story