Fri Dec 27 2024 11:11:48 GMT+0000 (Coordinated Universal Time)
38 లక్షల విరాళమిచ్చిన నారా లోకేష్ కుటుంబం
నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల వెంకటేశ్వస్వామిని నారా కుటుంబీకులు దర్శించుకున్నారు
నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల వెంకటేశ్వస్వామిని నారా కుటుంబీకులు దర్శించుకున్నారు. తిరుమల వెంకన్న సన్నిధిలో పూజలు చేశారు. ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకలను తమ కులదైవమైన వెంకటేశ్వరస్వామి సన్నిధిలోనే జరుపుకుంటుంది. నేడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, ఇతర కుటుంబ సభ్యులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు.
దేవాన్ష్ పుట్టిన రోజున...
దేవాన్ష్ పుట్టిన రోజున తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి అన్నదానం నిమిత్తం రూ.38 లక్షల విరాళాన్ని నారా కుటుంబీకులు అందించారు. గురువారం ఉదయం అన్న వితరణ అనంతరం భక్తులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అన్నప్రసాద వంటశాలను సందర్శించి అన్నదాన వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల సన్నిధిలో ఒక్కరోజు అన్నవితరణ చేయడం నారా కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది.
Next Story