Tue Dec 24 2024 01:44:23 GMT+0000 (Coordinated Universal Time)
అరసవిల్లి ఆలయంలో అద్భుత దృశ్యం
అరసవిల్లి సూర్యదేవాలయంలో రెండో రోజూ మూలవిరాట్ ను పాక్షికంగా సూర్యకిరణాలు తాకాయి
అరసవిల్లి సూర్యదేవాలయంలో రెండో రోజూ మూలవిరాట్ ను పాక్షికంగా సూర్యకిరణాలు తాకాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. తెల్లవారు జాము నుంచే భక్తులతో అరసవిల్లి ఆలయం నిండిపోయింది. స్వామివారిని సూర్యకిరణాలు తాకడం చూసిన భక్తులు తన్మయంతో భక్తి పారవశ్యంతో మునిగిపోయారు.
తాకిన సూర్యకిరణాలు...
దక్షాణియాణం అక్టోబరు 1, 2 తేదీలు, ఉత్తరాయణం మార్చి 9, 10 తేదీల్లో స్వామి వారిని సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఈరోజు కూడా సూర్యకిరణాలు స్వామి వారిని తాకుతాయని తెలుసుకున్న భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు.
Next Story