Thu Dec 19 2024 08:05:27 GMT+0000 (Coordinated Universal Time)
ధరలపై టీడీపీ నిరసన
రెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కూడా జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేసింది.
రెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కూడా జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేసింది. నారా లోకేష్ నేతృత్వంలో నిరసనగా బయలుదేరింది. తూళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ నిరసనకు దిగింది. బాదుడే బాదుడు అంటూ ప్లకార్డులు ధరించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చారు.
అసెంబ్లీ వరకూ....
ఇసుకను బంగారం చేసిన జగన్ తుగ్గక్ అంటూ నినాదాలు చేశారు. చెత్తపై పన్నేసిన చెత్త సీఎం జగన్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. ధరలు ఆకాశంలో.. జగన్ ప్యాలెస్ లో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ధరలు దిగాలంటే జగన్ దిగిపోవాలంటూ నిరసన ర్యాలీతో శాసనసభకు టీడీపీ సభ్యులు చేరుకున్నారు.
Next Story