శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఘనంగా ఫార్మసిస్ట్ దినోత్సవం
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25న ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25న ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఫార్మసిస్ట్‌లు చేసిన కృషిని సెప్టెంబర్ 25న కొనియాడతాం. ఫార్మసిస్ట్లను గౌరవించటానికి ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని ప్రపంచం మొత్తం నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య అభివృద్ధికి ఫార్మసిస్ట్‌లు చేసే సహకారాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూ ఉంటారు. ఎన్నో రోగాలకు మందులు రావడానికి కారణం ఈ ఫార్మసిస్టులే అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. వాళ్లు చేసే రీసెర్చ్ కారణంగా ఎన్నో రోగాలకు మందులు వస్తున్నాయి. ప్రపంచ ఫార్మసిస్ట్‌ల దినోత్సవం థీమ్ “ఫార్మసీ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం”.. అందులో భాగంగా భీమవరం లోని శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ లో ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫార్మసిస్ట్‌లు చేస్తున్న కృషిపై అవగాహన కల్పిస్తూ భీమవరం రోడ్లపై ర్యాలీ చేపట్టారు శ్రీ విష్ణు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు, సిబ్బంది.
కాలేజీలో ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. పలు కాంపిటీషన్స్ ను కూడా నిర్వహించి విజేతలకు బహుమానాలను అందించారు. క్విజ్ ప్రోగ్రామ్ లో విద్యార్థులు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. బి-ఫార్మా, డి-ఫార్మా విద్యార్థులు ఈ కార్యక్రమాలను సూపర్ హిట్ చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కెఎస్ నటరాజ్, హెచ్.ఓ.డి.డాక్టర్ ఎన్.లక్ష్మి ప్రశాంతి, కోఆర్డినేటర్లు బి. బ్రహ్మయ్య , ఎ. భాను ప్రకాష్, రాజా రామ్మోహన్ రావు , పలువురు లెక్చరర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్త్ కేర్ లో ఫార్మసిస్ట్స్ గొప్ప పాత్ర పోషిస్తూ ఉన్నారని.. రోజు రోజుకు ఫార్మసిస్ట్ ప్రాధాన్యత పెరుగుతుందని, రోగి కి వైద్యునికి మధ్య వారధిగా ఫార్మసిస్ట్ లు ఉంటారన్నారు బ్రహ్మయ్య. వైద్యులు రాసించే మందుల ప్రభావం.. తీవ్రత ను అంచనా వేయటం.. రోగులకు కావాల్సిన సలహాలను ఫార్మాసిస్టులు ఇస్తూ ఉంటారని తెలిపారు ఈవెంట్ కో ఆర్డినేటర్, లెక్చరర్ బి.బ్రహ్మయ్య.