Sun Dec 22 2024 23:42:28 GMT+0000 (Coordinated Universal Time)
Balineni : సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న బాలినేని
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. వైసీపీ ఇన్ఛార్జుల మార్పులపై అధినాయకత్వం కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో బాలినేని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా ఎవరిని నియమించాలన్న దానిపై ఇంకా సందిగ్దత వీడలేదు.
మాగుంటకే ఇవ్వాలంటూ....
ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డికే ఇవ్వాలని బాలినేని చాలా రోజుల నుంచి పట్టుబడుతున్నారు. అయితే పార్టీ హైకమాండ్ మాత్రం మాగుంటకు ఇవ్వకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేదా మరొకరికి ఇవ్వాలని యోచిస్తుంది. మాగుంట కుటుంబంపై ఢిల్లీ లిక్కర్ స్కాం ముద్రపడటంతో హైకమాండ్ మార్చాలని భావిస్తుంది. బాలినేని తాజా భేటీతో మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.
Next Story