Mon Dec 23 2024 13:54:55 GMT+0000 (Coordinated Universal Time)
టీ షర్ట్ ధరించాడని అధికారి సస్పెన్షన్
టీ షర్ట్ వేసుకుని సమావేశానికి హాజరయ్యాడని గోనెగండ్ల ఎంఈవో వినోద్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి
టీ షర్ట్ వేసుకుని సమావేశానికి హాజరయ్యాడని గోనెగండ్ల ఎంఈవో వినోద్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు డీఈవో రంగారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వినోద్ గోనెగండ్ల మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నారు. అయితే ఈ నెల 10వ తేదీన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు.
విచారణ జరిపి....
అయితే వినోద్ వీడియో కాన్ఫరెన్స్ కు టీ షర్ట్ తో హాజరయ్యారని ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రెస్ కోడ్ తెలియకుండా అధికారిగా ఎలా పనిచేస్తున్నారని నిలదీశారు. దీనిపై విచారణ జరిపిన విద్యాశాఖ అధికారులు వినోద్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story