Fri Dec 20 2024 05:46:00 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్
ఈరోజు సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికలకు 48 గంటల ముందు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈరోజు సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా లిక్కర్ అమ్మినట్లు తేలితే కఠిన చర్యలుంటాయని ఎన్నికల కమిషన్ అధికారులతో పాటు స్థానిక పోలీసులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సాయంత్రం ఆరు గంటల నుంచి...
ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మద్యం దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. తిరిగి పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మే 13వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు మద్యం దుకాణాలను తెరవాల్సి ఉంటుంది. 48 గంటల పాటు మద్యం దుకాణాలు, బార్లు కూడా క్లోజ్ చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
Next Story