Mon Dec 23 2024 17:14:37 GMT+0000 (Coordinated Universal Time)
మూడేళ్లుగా ముఖ్యమంత్రి పీకిందేమిటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న నంద్యాల సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరును పయ్యావుల తప్పుపట్టారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ తనను ఎవరూ పీకలేరు అని తనను తాను బలంగా ఉన్నానని నిరూపించే ప్రయత్నం నంద్యాల సభలో చేసుకున్నట్లుగా అనిపిస్తుందని పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు.
భాష మార్చుకోకుంటే?
ముఖ్మమంత్రి మూడేళ్లుగా ఏం పీకారని పయ్యావుల ప్రశ్నించారు. భాష మార్చుకోకుంటే ప్రజలు తొందరలోనే ప్రభుత్వాన్ని మార్చేస్తారన్నారు. ఏమి పీకాలో? ఎలా పీకాలో త్వరలో ప్రజలు నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఏదో అభద్రతలకు లోనవుతున్నట్లు కన్పిస్తుందని అని అన్నారు. ముఖ్యమంత్రి అసమర్థతకు ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు.
Next Story