Andhra Pradesh : ఏపీ నుంచి ఐప్యాక్ ప్యాకప్.. రీజన్ ఇదేనా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు 2019లో అధికారాన్ని తెచ్చిపెట్టిన ఐ ప్యాక్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్యాకప్ చెప్పేసింది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు 2019లో అధికారాన్ని తెచ్చిపెట్టిన ఐ ప్యాక్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్యాకప్ చెప్పేసింది. ఐ ప్యాక్ సంస్థ బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ దే అయినప్పటికీ ఆయన 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బీహార్ రాజకీయాలకు పరిమితమయ్యారు. దీంతో ఐప్యాక్ సంస్థలో పనిచేసిన వారు దానిని నిర్వహిస్తున్నారు. 2024 ఎన్నికలకు కూడా వైఎస్ జగన్ మరోసారి గెలిచేందుకు ఐప్యాక్ సంస్థను కొనసాగించారు. ఐప్యాక్ సంస్థకు రుషిరాజ్ నేతృత్వం వహించారు. ఐదేళ్ల పాటు ఐప్యాక్ సంస్థ వైసీపీకి సేవలందించింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ, సోషల్ మీడియాలో ప్రచారం వరకూ అంతా తానే అయి ఐప్యాక్ సంస్థ జగన్ కు అనుకూలంగా పనిచేసింది.
ఓటమి పాలు కావడంతో...
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now