Mon Dec 23 2024 13:29:30 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ పాదయాత్రలో టెన్షన్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. నీలిసానిపేటలో లోకేష్ మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. లోకేష్ స్టూల్ పై నిల్చుని ప్రసంగిస్తుండగా పోలీసులు వచ్చి స్టూల్ ను పట్టుకెళ్లారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ లోకేష్ ను పాదయాత్రలో అడ్డుకుంటూనే ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ప్రసంగాన్ని అడ్డుకున్న పోలీసులు...
రోడ్డుపై ప్రసంగాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పోలీసులు చెబుతున్నారు. గాజులమండ్య సీఐకి ఈ సందర్భంగా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని జీ పాలెం రాత్రి బస నుంచి లోకేష్ తన పాదయాత్ర ప్రారంభించారు. కార్యకర్తలతో సెల్ఫీలు దిగిన లోకేష్ అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఆ తర్వాత లోకేష్ నీలసానిపేట రహదారిపై మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.
Next Story