Fri Nov 22 2024 03:32:45 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేటి నుంచి ఏపీలో పల్లె పండగ వారోత్సవాలు
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పల్లె పండగ కార్యక్రమం ప్రారంభం కానుంది. పవన్ కల్యాణ్ కంకిపాడులో పాల్గొంటారు
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పల్లె పండగ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈరోజు నుంచి వారం రోజుల పాటు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. మొత్తం 4,500 కోట్ల రూపాయలతో 30 వేల పనుల వరకూ గ్రామాాల్లో చేపట్టాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై నిర్లక్ష్యం చేసిన కారణంగా ఈ ప్రభుత్వం గ్రామాల పురోభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఈ పల్లె పండగకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కంకిపాడు గ్రామంలో హాజరుకానున్నారు.
అభివృద్ధి పనులకు...
అక్కడ రహదారి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె పండగ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించింది. ఈ నెల 20వ తేదీ వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. 13,326 పంచాయతీలలో నేడు పల్లె పండగ ప్రారంభం కానుంది. గతంలో రూపొందించిన గ్రామసభలు నిర్వహించిన తీర్మానాల మేరకు పనులను చేపట్టనున్నారు. ఆ గ్రామానికి ఏది ముఖ్యమైన పనో ఇప్పటికే గుర్తించడంతో వాటిని ఈ నిధులతో చేపట్టనున్నారు.
Next Story